- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉత్కంఠ: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణకు జస్టిస్ ఎస్వీఎన్ భట్టి విముఖత
దిశ, డైనమిక్ బ్యూరో : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ఎల్‌ఎల్‌పీ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు బ్రేక్ పడింది. ఈ కేసును విచారించేందుకు జస్టిస్ ఎస్వీఎన్ భట్టి విముఖత వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ఎస్ఎల్‌పీ విచారణ ప్రారంభానికి ముందు ద్విసభ్య బెంచ్ విచారణకు విముఖత చూపింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ద్విసభ్య బెంచ్ విచారణకు మొగ్గు చూపలేదు. జస్టిస్ ఎస్వీఎన్ భట్టి నాట్ బిఫోర్ మీ అని తేల్చి చెప్పేశారు. దీంతో విచారణపై ఉత్కంఠ నెలకొంది. దీంతో చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ముందు మెన్షన్ చేసేందుకు చంద్రబాబు నాయుడు తరఫు న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా వెళ్లారు. సుప్రీంకోర్టుకు సెలవులు ఉన్న నేపథ్యంలో ఈ కేసుపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరనున్నారు. అత్యవసరంగా కేసు విచారణ చేపట్టాలని సిద్ధార్థ లూథ్రా అభ్యర్థించనున్నారు. ఇకపోతే అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఎ కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు వ్యవహారంలో తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై బుధవారం సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం విచారించనుంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్‌వీఎన్ భట్టిల నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఐటం 61 కింద ఈ కేసు లిస్ట్ అయింది. అయితే జస్టిస్ ఎస్వీఎన్ భట్టి విచారణ జరిపేందుకు విముఖత వ్యక్తం చేశారు.
జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ఏపీ వ్యక్తి కావడంతోనేనా..
జస్టిస్ ఎస్వీఎన్ భట్టి (సరస వెంకటనారాయణ భట్టి) ఏపీకు చెందిన వ్యక్తి కావడంతోనే ‘నాట్ బిఫోర్ మీ’ అని అన్నట్లు తెలుస్తోంది. స్వరాష్ట్రానికి చెందిన కేసు నేపథ్యంలో విచారణపై విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే జస్టిస్ ఎస్వీఎన్ భట్టి స్వస్థలం ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లి. చంద్రబాబు నాయుడు సొంత జిల్లా కావడంతో ఈ కేసు విచారణ పట్ల విముఖత చూపినట్లు తెలుస్తోంది. దీంతో చంద్రబాబు నాయుడు పిటిషన్‌పై విచారణను వేరే బెంచ్‌కు సీజేఐ బదిలీ చేస్తారా? లేదా అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.