రియలైజ్ అవుతున్న జనసైనికులు.. ఏం ఫిక్స్ అయ్యారో తెలుసా? (వీడియో)

by GSrikanth |
రియలైజ్ అవుతున్న జనసైనికులు.. ఏం ఫిక్స్ అయ్యారో తెలుసా? (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: సీట్ల ప్రకటనతో జనసైనికుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. కూటమి ప్రకటించిన 118 సీట్లలో జనసేనకు 24 సీట్లే కేటాయించడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. పదేళ్లుగా ప్రజల కోసం పోరాడుతున్నామని.. కీలక సమయంలో దాదాపు పదిహేనేళ్లు అధికారంలోకి ఉన్న టీడీపీకి జనసేన అండగా నిలబడిందని అలాంటి పార్టీకి 24 సీట్లు కేటాయించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడిప్పుడే జనాలు జనసేన వైపు చూడటం ప్రారంభించారని.. ఇలాంటి సమయంలో రాంగ్ స్టెప్ తీసుకోవద్దంటూ అభిమానులు, పార్టీ కార్యకర్తలు అధినేతకు సూచనలు చేస్తున్నారు. ఇదంతా నిన్న సీట్లు ప్రకటించిన తర్వాత వచ్చిన ఆవేదన.. తాజాగా జనసైనికులకు వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకున్నట్లు తెలుస్తోంది.

60-70 సీట్లు తీసుకొని 20-30 కోల్పోవడం కంటే పక్కా గెలిచి స్థానాల్లో, జనసేనకు పట్టున్న నియోజకవర్గాల్లో బరిలోకి దిగి వందశాతం గెలిపించుకునేలా కృషి చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ‘ఆవేశం ఆపుకొని ఈ సారి పవన్ కల్యాణ్‌తో పాటు పోటీలో ఉండే అభ్యర్థులను గెలిపించుకుందాం. ఎలివేషన్స్ ఇవ్వడానికి ఇది మూవీ కాదు. ఆయన్ను నమ్మి పదేళ్లుగా వెనకాల ఉన్నాం. ఈ సారి కూడా అలాగే ఉందాం. వ్యూహం ఆయనకే వదిలేద్దాం. అధినేత చెప్పిన పనిని శ్రద్ధగా నిర్వర్తిద్దాం’ అని అభిప్రాయానికి వచ్చారు జనసైనికులు. ఈ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తున్నారు.


Advertisement

Next Story