- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
YS Jagan: ఆ షాక్ తో చనిపోయిన వాళ్ళకోసం జగన్ ఓదార్పు యాత్ర 1.5,2
దిశ డైనమిక్ బ్యూరో: ఎంపీ రఘురామకృష్ణం రాజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాన్ని జీర్ణించుకోలేక షాక్ తో మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలను ఓదార్చేందుకు ఓదార్పు యాత్ర చేసిన జగన్ మళ్ళీ ఓదార్పు యాత్రకు సిద్ధం కావాలన్నారు. రానున్న ఏఎన్నికల్లో వైసీపీని ఓడించి ఇంటికి పంపడం ఖాయమని పేర్కొన్నారు.
వైసీపీ ఓటమిని ముందుగానే చూపిస్తూ తీసిన సినిమా అట్టర్ ప్లాప్ అయినా నేపథ్యంలో ఎవరైనా షాక్ తో చనిపోయి ఉంటారు. వాళ్ళని ఓదార్చడానికి ఓదార్పు యాత్ర 1.5ని.. అలానే ఎన్నికల తరువాత ఓడిపోయిన మీ వాళ్ళని ఓదార్చడానికి ఓదార్పు యాత్ర 2ని చెయ్యాలి అని నాలుగు రోజుల క్రితం వరకు వైసీపీ లో ఉన్న తాను సూచిస్తున్నట్లు తెలిపారు.
ఇక ఎక్కడైనా సెక్రటేరియట్ తాకట్టు పెడతారా అని మండిపడ్డారు. సీఎం జగన్ సెక్రటేరియట్ ని కూడా తాకట్టు పెట్టారంటే ఇంతకంటే దారుణం ఉందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి తప్పు చేస్తున్నాడని తెలిసీ ప్రశ్నించడానికి భయపడుతున్నారంటే సిగ్గు చేటు అని ఛీ కొట్టారు. చంద్రబాబు నాయుడు కేవలం రూ/ 700 కోట్లతో సెక్రటేరియట్ కట్టించారని కొనియాడారు.
ఇక జగన్ మాత్రం తన సొంత కొంప కట్టుకోవడానికి రూ/ 700 కోట్లు తగలేశారని దుయ్యబట్టారు. సెక్రటేరియట్ కట్టిన చంద్రబాబు సీఎం కావల.. లేక సెక్రటేరియట్ ని తాకట్టుపెట్టి ఆంధ్రరాష్ట్ర ప్రజలను తలెత్తుకోలేకుండా చేస్తూ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్న జగన్ కావాలా అని ప్రశ్నించారు..? జగన్ చేస్తున్న అకృత్యాలు అరాచకాలు కళ్ళముందు కనిపిస్తున్న జగన్ కి జై కొట్టే వాడు ఎవడైనా ఉన్నాడంటే వాడికంటే మూర్ఖుడు ఈ ప్రపంచలంలో ఇంకొకరు ఉండరని ఎద్దేవ చేశారు.