క్రైస్తవుడైన జగనే మళ్లీ సీఎం కావాలి.. అప్పుడే మనం బలంగా ఉండొచ్చు : ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి

by Seetharam |   ( Updated:2023-11-29 05:35:17.0  )
క్రైస్తవుడైన జగనే మళ్లీ సీఎం కావాలి.. అప్పుడే మనం బలంగా ఉండొచ్చు : ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో : కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ రాష్ట్రంలో ఒక క్రైస్తవుడు ముఖ్యమంత్రిగా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. క్రైస్తవుడైన వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవ్వాలని తాను బలంగా కోరుకుంటున్నట్లు తెలిపారు. కాకినాడ సిటీలో క్రైస్తవ సువార్త సభలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. కాకినా సిటీ ఎమ్మెల్యేగా తాను, రూరల్ ఎమ్మెల్యేగా కురసాల కన్నబాబు, సీఎంగా వైఎస్ జగన్ ఉన్నారంటూ అందుకు క్రైస్తవులే కారణం అని అన్నారు. కన్నబాబు ఒక మాజీమంత్రిగా.. నేను ఎమ్మెల్యేగా.. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా అందరం ఉన్నాం అంటే అందుకు మీ ఆశీర్వాదాలు.. మీ యెుక్క ప్రార్థనలు..దేవుడి మెుక్క బలం అని ఖచ్చితంగా చెప్తున్నానని అన్నారు. రాష్ట్రంలో ఎన్నికలకు మహా అయితే 140రోజులు ఉన్నాయని తెలిపారు. 140 రోజుల తర్వాత ముఖ్యమంత్రి అయ్యేది ఎవరో అనేది తేలిపోయే రాజు అని చెప్పుకొచ్చారు. ఒక క్రైస్తవుడు ముఖ్యమంత్రిగా ఉండాలన్నది నా కోరిక అని తెలిపారు. క్రైస్తవుడు అయిన వైఎస్ జగన్ మళ్లీ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అక్కడ ఉంటే మనం ఎంత బలంగా ఉండొచ్చు అనేది వేదికపై ఉన్న ఈ పాస్టర్లు అందరికీ తెలుసునంటూ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

Next Story

Most Viewed