- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
జగనాసురుడు అనే రాక్షసుడిపాలనలో ఏపీ: కిమిడి నాగార్జున
దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగనాసురుడు అనే రాక్షసుడు పాలిస్తున్నాడు అని విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు కిమిడి నాగార్జున విమర్శించారు. ఈ రాక్షస పాలన నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది అని స్పష్టం చేశారు. బాబాయిని అతిదారుణంగా హత్య చేసి గుండెపోటుగా చిత్రీకరించి తప్పించుకోవాలనుకున్నారు అని ఆరోపించారు. అయితే వైఎస్ సునీతారెడ్డి పోరాట ఫలితంగా వాస్తవాలు బయటకు వస్తున్నాయి అని వ్యాఖ్యానించారు. హత్యచేసి టీడీపీ మీద ఆ నిందను వేశారు కానీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు అని చెప్పుకొచ్చారు.
అనంతరం వైఎస్ వివేకా హత్యలో ఎవరి ప్రమేయం ఉందో ప్రజలకు అర్థమైందన్నారు. ఫ్యాక్షన్ ఫ్యామిలీ నుంచి వచ్చిన జగన్ ప్రజలను అన్ని విధాలా పీడించుకుని తింటున్నారని చెప్పుకొచ్చారు. ఆదాయ వనరులు సృష్టించలేక, నిధులు తెప్పించలేక ప్రజల పై భారాలు వేసి పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు. భుదందాలు, అన్నింటా కమిషన్‌లతో అడ్డంగా దోచుకున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ నాలుగేళ్ల పాలనలో అభివృద్ధి జరిగిందా?విశాఖలో రూపురేఖలు మారాయా? అని ప్రశ్నించారు. గతంలో టీడీపీ భోగాపురం విమానాశ్రయానికి శంఖుస్థాపన చేసిందని ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ కావాలనే దాన్ని అభివృద్ధి చేయకుండా నిలిపివేశారని కిమిడి నాగార్జున ఆరోపించారు.