- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జగన్ ఓ చార్లెస్ శోభరాజ్..అవినీతిని బయటకు కక్కిస్తాం: బీజేపీ నేత సత్యకుమార్
దిశ, డైనమిక్ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ను అంతర్జాతీయ నేరస్తుడు చార్లెస్ శోభరాజుతో పోల్చారు. అంతర్జాతీయ నేరస్తుడైన చార్లెస్ శోభరాజ్ సైతం కొన్నేళ్లపాటు చిక్కకుండా తప్పించుకు తిరిగారని గుర్తు చేశారు.ప్రస్తుతం వైఎస్ జగన్ అయితే పదేళ్లుగా బెయిల్‌పై తిరుగుతున్నారని చెప్పుకొచ్చారు. వైసీపీ అవినీతిని ప్రజా క్షేత్రంలో ఎక్కడికక్కడ ఎండగడతాం అని చెప్పుకొచ్చారు. ఇప్పటికే వైసీపీ చేస్తున్న మద్యం అక్రమాలపై పోరాటం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి ఇతర పార్టీలు సైతం మద్దతు ప్రకటించాయని అన్నారు. అలాగే బైజూస్‌లో సైతం అక్రమాలు చోటు చేసుకున్నాయన్నారు. ఈ అవినీతికి సంబంధించిన ఆధారాలను సేకరించే పనిలో పడినట్లు చెప్పుకొచ్చారు. వైసీపీ అవినీతిపై బీజేపీ ఆధారాలను సేకరిస్తోందని, త్వరలోనే కేసులు పెడతామంటూ బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ హెచ్చరించారు.
కక్ష సాధింపుతోనే పాలన
వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఆరోపించారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పట్ల వ్యవహరించిన తీరు సరికాదన్నారు. చంద్రబాబు బెయిల్ అంశం అనేది కేంద్ర ప్రభుత్వం పరిధిలోనిది కాదని..కోర్టు పరిధిలోని అంశమని చెప్పుకొచ్చారు. ప్రతి అంశంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోలేదని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనంతరం గత 15 రోజులుగా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు వెకిలి మాటలు, వికృత చేష్టలతో ప్రజలు దృష్టిని మరల్చుతున్నారని సత్యకుమార్ ధ్వజమెత్తారు. మహిళ అని కూడా చూడకుండా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిపై విమర్శలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు. ఇకపోతే చంద్రబాబు అరెస్ట్ జగన్ కక్ష సాధింపు చర్యలకు నిదర్శనం అని చెప్పుకొచ్చారు. నిత్యం కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే ఇక రైతులు, రైతాంగ సమస్యలపై దృష్టి సారించేది ఎప్పుడు అని ప్రశ్నించారు. ఇప్పటికే ఏడు సార్లు విద్యుత్ చార్జీలు పెంచి సామాన్యుడు నడ్డి విరిచారని అన్నారు. విద్యుత్ చార్జీలు పెంచినా కరెంట్ కోతలను మాత్రం నిలువరించడంలో విఫలమయ్యారని అన్నారు. ఉత్తుత్తి బటన్లు నొక్కుతూ ప్రజలను జగన్ మోసం చేస్తున్నారని బీజేపీ కార్యదర్శి సత్యకుమార్ ద్వజమెత్తారు. ఏపీ పోలీసులపై వైసీపీ ప్రభుత్వ ఒత్తిడి తీవ్రంగా ఉందని.. ఆ ఒత్తిడిని భరించలేక ప్రతిరోజు పోలీసులు ఆత్మహత్య చేసుకుంటున్నారని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అన్నారు.