Love marriages:‘ప్రేమ పెళ్లి రేపిన చిచ్చు’..కొడుకు ప్రేమే ఆ తల్లికి శాపమా?

by Jakkula Mamatha |   ( Updated:2024-09-14 11:09:10.0  )
Love marriages:‘ప్రేమ పెళ్లి రేపిన చిచ్చు’..కొడుకు ప్రేమే ఆ తల్లికి శాపమా?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ప్రేమ వివాహాలు(Love marriages) ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రేమకు కుల, మత భేదాలు ఉండవు. ఒక్కసారి మనసులో చిగురించిన ప్రేమ ఎంతటి వరకైనా తీసుకెళ్తుంది అంటుంటారు.. వాస్తవానికి ఇదే నిజం. ఎందుకంటే ఇటీవల చూస్తూనే ఉన్నాం. దేశాలను దాటి మరీ ప్రేమ పెళ్లిళ్లు జరుగుతున్నాయి. కానీ ఇంకా కొందరు పెద్దలు ప్రేమ పెళ్లిళ్లకు(Love marriages) అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలోనే ఆ ప్రేమ జంట తల్లిదండ్రులను కాదని పెళ్లి సైతం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ప్రేమ పెళ్లికి(Love marriages) సంబంధించిన ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే.. కులాంతర వివాహం చేసుకున్న ఓ ప్రేమ జంటకు(love couple) షాకింగ్ ఘటన ఎదురైంది. ప్రేమ పెళ్లిని తట్టుకోలేని ఆ యువతి పెద్దలు కోపంతో యువకుడి తల్లి పట్ల అమానుషంగా ప్రవర్తించారు. ఈ దారుణ ఘటన కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలంలోని కలుకుంటలో చోటుచేసుకుంది. అయితే యువతి కుటుంబం(family) పెళ్లికి అంగీకరించదని తెలిసి ఆ యువకుడు అమ్మాయిని తీసుకుని కుటుంబంతో సహా ఆరు నెలల కిందట ఊరు విడిచి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో ఇటీవల అబ్బాయి తల్లి ఊర్లోకి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న అమ్మాయి కుటుంబ సభ్యులు ఆవేశంతో(emotion) రగిలిపోయారు. వెంటనే బంధువులతో కలిసి ఆమెను చెట్టుకు కట్టేశారు. మతిస్థిమితం(paranoia) లేని వ్యక్తితో ఆమెకు పెళ్లి చేసే ప్రయత్నం చేశారు. ఈ దారుణాన్ని అడ్డుకోవాలని అక్కడే ఉన్న స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ దారుణాన్ని అడ్డుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story

Most Viewed