ఆ అమ్మాయిలకు మద్దతుగా.. పూనమ్ కౌర్ సంచలన లేఖ!

by Geesa Chandu |   ( Updated:2024-08-31 14:22:12.0  )
ఆ అమ్మాయిలకు మద్దతుగా.. పూనమ్ కౌర్ సంచలన లేఖ!
X

దిశ, వెబ్ డెస్క్: ఆమె ఏ ట్వీట్ చేసినా సంచలనమే! ఆమె సమాజంలో మహిళల పట్ల అగౌరవంగా మాట్లాడేవారికి, వారిపై అనవసరంగా నోరు పారేసుకునేవారికి, వారిపట్ల చిన్నచూపు చూసేవారికి, వివక్షను ఎదుర్కొంటున్న మహిళలకు, ఇలా విషయం ఏదైనా కావచ్చు.. అలాంటి సంఘటనలు, విషయాల పట్ల ఆమె స్పందించక మానదు. ఆమె మరెవరో కాదు టాలీవుడ్ నటి పూనమ్ కౌర్.

అయితే.. ఇప్పుడు కూడా ఒక సంఘటనకు సంబంధించి అలానే స్పందించారు నటి పూనమ్ కౌర్. కాగా, తాజాగా ఏపీలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన సంఘటనను ఉద్దేశించి, పూనమ్ చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అక్కడ అమ్మాయిలకు మద్దతుగా స్పందిస్తూ.. పలు విషయాలను వెల్లడించింది.

అందులో నటి పూనమ్ స్పందిస్తూ.. "ప్రియమైన అమ్మాయిలారా.. మీలో ఒకరిగా మీ అందరికీ ఈ లేఖ రాస్తున్నాను. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎన్నో ఆశలతో, నమ్మకంతో బయటకు పంపుతున్నారు. కానీ బయట మీకు జరుగుతున్న అవమానాలు చూసి నేను బాధపడుతున్నాను. మీకు ఇటీవల జరిగిన పరిస్థితులు చాలా దారుణం. అయితే విద్యార్థి సంఘాలు ఈ ఘటన గురించి ఐక్యంగా పోరాడితే నిజం బయటకు వస్తుందని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. మన దేశంలో చట్టం బలవంతులకు బలహీనంగా, బలహీనులకు బలంగా వర్తించబడుతుంది అనే నానుడి ఇటీవల జరిగిన సంఘటనలతో గుర్తుకు తెచ్చాయి. 'నేరస్తులు ఎలా రక్షించబడతారు, బాధితులు ఎలా అవమానింపబడతారు' అనేది నాకు బాగా అనుభవం. అలాంటి చర్యలతో నేను మానసికంగా చాలా అలసిపోయాను. అయితే ఇప్పుడు జరిగిన ఘటనను గమనిస్తే.. మీరు ఒకటి గుర్తు పెట్టుకోగలరు. వ్యక్తులు ఎంత శక్తివంతులైనా, వారిపై కఠిన చర్యలు తీసుకునేవరకు మీరు ఊరుకోవద్దు, వారు ఏ పార్టీకి చెందిన వారైనా మీరు అస్సలు వదలకండి. నేను మీకు రెజ్లర్స్ నిరసనను మాత్రమే గుర్తు చేయగలను, ఇక్కడ ఏపీలో కూడా అమ్మాయిలు తమ కోసమే కాకుండా, మనందరికీ తెలియని చాలా మంది ఇతర విద్యార్థుల కోసం పోరాడుతున్నారు" అని తను సోషల్ మీడియాలో రాసిన లేఖలో పేర్కొంది నటి పూనమ్ కౌర్.

Advertisement

Next Story