మరో వివాదంలో ఎమ్మెల్యే ఆదిమూలం

by Mahesh |
మరో వివాదంలో ఎమ్మెల్యే ఆదిమూలం
X

దిశ ప్రతినిధి, తిరుపతి: సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే ఓ మహిళ కేసులో పార్టీ నుంచి బహిష్కరణకు గురైన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నారు. కోనేటి ఆదిమూలం ఒక మహిళతో 'నువ్వు చాలా అందంగా ఉన్నావు. నీ పర్సనాలిటీ చాలా బాగుంది’ అంటున్న ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ ఆడియో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలందేనా..కాదా..? అనేది తెలియాల్సి ఉంది.

లైంగికదాడి ఆరోపణలతో..

ఇది ఇలా ఉండగా.. మహిళ కార్యకర్త పై లైంగిక దాడి చేసిన కేసులో.. ఎమ్మెల్యే ఆదిమూలంపై గత నెలలో కేసు నమోదవ్వడం, టీడీపీ నుంచి బహిష్కరణకు గురవ్వడం తెలిసిందే. అనంతరం ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేస్తారనే గుసగుసలు అప్పట్లో వినిపించాయి, ఈలోగా ఆ మహిళ కేసు విరమించుకోవడంతో కథ సుఖాంతమైందనుకున్నారు. ఇప్పుడు మరో ఆడియో వైరల్ కావడంతో ఆదిమూలం మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed