- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముందస్తు వర్ష సూచనల కోసం గూగుల్‌తో ఐఎండి ఒప్పందం: కేంద్రం ప్రకటన
దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో నిర్దిష్ట ప్రాంతంలో వర్షం పడే అవకాశాన్ని ముందుగానే తెలుసుకునేందుకు వీలుగా గూగుల్ ఆసియా సంస్థతో భారత వాతావరణ శాఖ (ఐఎండి) ఒప్పందం చేసుకున్నట్లు భూ శాస్త్ర శాఖ మంత్రి కిరెన్ రిజుజు తెలిపారు. రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. తుఫాన్లు సంభంచించే సూచనలను మాత్రం యధావిధాగా ఐఎండినే చేస్తుందని పేర్కొన్నారు. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (ఇన్‌కాయిస్), ఐఎండి సంయక్తంగా సముద్ర జలాల్లో ఏర్పడే ప్రతికూల పరిస్థితులపై ముందస్తుంగా హెచ్చరికలు జారీ చేస్తుంటాయని చెప్పుకొచ్చారు. సముద్రంలో ఏర్పడే రాకాసి అలలు, సునామీ, తుఫాన్లపై ఐఎండి ముందస్తు హెచ్చరికలు చేస్తుంటాయన్నారు. సముద్ర జలాల పరిస్థితిపై ప్రతి రోజు ఐఎండి బులెటిన్లను విడుదల చేస్తుందని పేర్కొన్నారు. ఈ హెచ్చరికలకు అనుగుణంగా సముద్రంలో సుదూర ప్రాంతాల్లో ఎలాంటి సమాచార వ్యవస్థ అందుబాటులో లేని మత్స్యకారులకు నావిక్ మెసేంజిగ్ సర్వీస్ ద్వారా అలర్ట్‌లు పంపించడం జరుగుతుందని కేంద్ర భూ శాస్త్ర శాఖ మంత్రి కిరెన్ రిజుజు వెల్లడించారు.
ఆడుదాం ఆంధ్రకు ఆర్థిక సాయం అడగలేదు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువతలో క్రీడలపట్ల ఆసక్తిని ప్రోత్సహించేందుకు ఈ నెల 26 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబోతున్న ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల కోసం తమ నుంచి ఎలాంటి ఆర్థిక సాయం కోరలేదని కేంద్ర క్రీడా, యువజన శాఖ మంత్రి అనురాగ్ థాకూర్ వెల్లడించారు. రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిస్తూ ఆడుదాం ఆంధ్ర ఈవెంట్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం 15 ఏళ్ళు పైబడిన యువత కోసం అన్ని గ్రామాలు, వార్డు సచివాలయల నుంచి మండల, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు క్రీడా పోటీలు నిర్వహిస్తోంది. యువతలో చురుకైన జీవనశైలిని తీసుకురావడానికి, వారిలో ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించడం ఆడుదాం ఆంధ్ర ఈవెంట్ ప్రధాన లక్ష్యాలలో ఒకటి. అలాగే గ్రామ, వార్డు సచివాలయం స్థాయిలో క్వాలిఫై అయిన జట్లు మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటాయని మంత్రి తెలిపారు. క్రీడలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటాయి. రాష్ట్ర స్థాయిలో క్రీడల పోటీలు నిర్వహించడం ప్రధానంగా ఆయా రాష్ట్రాల బాధ్యత. వీటికి తోడ్పాటు అందిచేందుకు కేంద్ర ప్రభుత్వం సాయ పడుతూ ఉంటుందని కేంద్ర క్రీడా, యువజన శాఖ మంత్రి అనురాగ్ థాకూర్ పేర్కొన్నారు.