Pawan Kalyan: మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి ఇబ్బంది ఉంటే మాకు చెప్పండి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

by Mahesh |
Pawan Kalyan: మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి ఇబ్బంది ఉంటే మాకు చెప్పండి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
X

దిశ, వెబ్‌డెస్క్: 2024 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలోనే గత ప్రభుత్వం చేసిన విధ్వంసం వల్ల రాష్ట్ర తీవ్రంగా నష్టపోయిందని, రాష్ట్రంలో పాలనా వ్యవస్థ దారుణంగా తయారైందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం కలెక్టర్ల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఐఏఎస్, ఐపీఎస్ వ్యవస్థలను కీలు బొమ్మలుగా మార్చింది. దీంతో అన్ని వ్యవస్థలు దారుణంగా పతనం చెందాయి. వాటిని తిరిగి పటిష్టం చేయాలి.. ఇందుకోసం అధికారులు వేగంగా, నిజాయితీగా పని చేయాలి. రాష్ట్రంలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం నుంచి సంపూర్ణ స్వేచ్ఛ ఉంటుంది. మీరు చేసే పనిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర రాజకీయ నాయకుల నుంచి ఎదైన సమస్య తలెత్తినా.. మా మంత్రుల శాఖలో ఎవైన లోపాలు కనిపించినా .. మా దృష్టికి తీసుకురాండి.. మేము వాటిని పరిష్కరిస్తాము. అంతేగాని రాష్ట్ర అభివృద్దికొసం జరిగే ఈ ఉద్యమాన్ని మాత్రం అధికారులు ఆపవద్దు అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలెక్టర్లతో జరిగిన సమావేశంలో నిర్వహించారు.

Next Story

Most Viewed