- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైసీపీ పాలన ఇలానే ఉంటే యువత భవిష్యత్ ప్రమాదకరం : దగ్గుబాటి పురంధేశ్వరి
దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక పాలన, కక్షపూరిత రాజకీయాలు నడుస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు.కక్ష పూరిత రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఏపీ పాలన ఉందని పురంధేశ్వరి ఆరోపించారు. విశాఖలో ఆదివారం జరిగిన బీజేపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్‌ల సమావేశంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ, ఎంపీ జీవీఎల్ నరసింహరావుతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం అన్నీ తప్పుడు లెక్కలు చెప్తూ ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రజలకు బీజేపీ వాస్తవాలు తెలియజేసిందని అన్నారు. అయితే తాము వాస్తవాలు చెప్తే వాటిని వక్రీకరించడంతో పాటు ఖండించే క్రమంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నీ అసత్యాలే తెలియజేశారన్నారు. వాస్తవాలను దాచి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి నిధుల కోసం ప్రభుత్వ ఆస్తుల అమ్మలేదా అని ప్రశ్నించారు. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పీఎఫ్ నిధులు వాడుకోలేదా అని నిలదీశారు. మరి ఈ అంశాలపై ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎందుకు ప్రజలకు తెలియజేయలేదని అన్నారు. రాష్ట్ర విభజన అనంతరం రోజు రోజుకు ఏపీ ఆర్థిక వ్యవస్థ పతనమైపోతుందని పురంధేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదని.. కొత్త పరిశ్రమలు రావడం లేదని అన్నారు. కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు సైతం రాష్ట్రాన్ని వదిలి పారిపోతున్నాయని చెప్పుకొచ్చారు. వైసీపీ పాలన ఇలానే ఉంటే భవిష్యత్‌లో యువత ఉపాధి కోల్పోయి తీవ్రమైన నిరాశ నిస్పృహలకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. క్షేత్రస్థాయిలో అందరికీ సమాచారం ఇవ్వడమే కాకుండా ప్రజలను ప్రభావితం చేసే శక్తి కేవలం ఒకే ఒక్క సోషల్ మీడియాకు మాత్రమే ఉంది అని దగ్గుబాటి పురంధేశ్వరి చెప్పుకొచ్చారు. ఇకపోతే మహిళా రిజర్వేషన్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి దివంగత ఎన్టీఆర్ అప్పట్లో మహిళలకు ఆస్తి హక్కు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు మోడీ సర్కార్ వారికి సంపూర్ణ సాధికారిత కల్పించేందుకు 33 శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చారు అని కొనియాడారు. ప్రధాని నరేంద్రమోడీ వంటి సమర్థవంతమైన నాయకత్వంలో పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందని దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు.