దారి ఇలా..మరి ప్రయాణం ఎలా?

by Jakkula Mamatha |
దారి ఇలా..మరి ప్రయాణం ఎలా?
X

దిశ,కుక్కునూరు:గత కొద్ది రోజులుగా కురిసిన వర్షాలకు మాధవరం పంచాయతీ కౌండిన్య ముక్తి గ్రామానికి వెళ్లే రహదారి పూర్తిగా దెబ్బతింది. దీంతో ప్రజలు, గ్రామస్తులు నిత్యావసరాల పనుల నిమిత్తం బయటకు రావాలంటే అడుగు తీసి అడుగు ముందుకు వేసే పరిస్థితి లేదు. ఏ రకంగా అంటే కనీసం ద్విచక్ర వాహనంతో అయినా బయటకు రావాలంటే ఎక్కడ జారీ పడతామోననే భయం ఉంది. ఈ దారి గురించి పట్టించుకునే నాథుడే లేడు. చినుకు పడితే చిత్తడిగా తయారవుతుంది. అధికారులు ఉన్నారో లేదో తెలియదు. రాజకీయ పార్టీల నాయకులకు మాత్రం ఎన్నికల సమయంలో ఓట్ల కోసం గుర్తుకు వస్తామంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed