- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
జాతరలో మహిళా ఎస్సై పై దాడి.. హోంమంత్రి అనిత తీవ్ర ఆగ్రహం
by Jakkula Mamatha |

X
దిశ,వెబ్‌డెస్క్: విజయనగరం జిల్లా(Vijayanagaram Disrtict)లో మహిళా ఎస్సై పట్ల ఆకతాయిల దాడి ఘటనపై హోంమంత్రి అనిత(Home Minister Anitha) ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం మత్తులో హద్దులు మీరి ప్రవర్తించిన దుండగుల పై కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అనిత తెలిపారు. వేపాడ మండలం గుడివాడ గ్రామంలో ‘డాన్స్ బేబీ డాన్స్’ కార్యక్రమంలో నృత్యం చేస్తున్న మహిళలపై తాగుబోతుల అసభ్యంగా ప్రవర్తించారు. వారిని అడ్డుకోబోయిన మహిళా ఎస్సై పై దురుసుగా ప్రవర్తించడం క్షమించరాని నేరమని హోంమంత్రి తెలిపారు. విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్‌తో ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే 9 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. జాతర పేరుతో మహిళల పట్ల పోకిరీ వేషాలు వేస్తే సహించబోమని హోంమంత్రి అనిత తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.
Next Story