- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
జీతాలు పెంచండి.. హోంమంత్రి అనితకు రామకృష్ణ లేఖ

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap)లో వేతనాలు సరిపోక హోంగార్డులు నానా తిప్పలు పడుతున్నారు. పెరుగుతున్న ధరల దృష్ట్యా కుటుంబ పోషణ రోజు రోజుకు భారమవుతోంది. దీంతో తమ వేతనాలు పెంచాలని హోంగార్డులు(Home Guards) ఎప్పటి నుంచో కోరుతున్నారు. అయితే రోజులు గడుస్తున్నాయని తప్ప.. వేతనాలు మాత్రం పెరగడంలేదనే ఆవేదన చెందుతున్నారు. కూటమి ప్రభుత్వం అయినా తమ జీతాలు పెంచుతుందోమోనని ఎదురు చూస్తున్నారు.
అయితే ఈ సమస్యపై సీపీఐ దృష్టి సారించారు. ఈ మేరకు రాష్ట్ర హోంమంత్రి అనితకు CPI నేత రామకృష్ణ లేఖ రాశారు. హోంగార్డులకు జీతాలపెంచాలని కోరారు. తెలంగాణ(Telangana)లో రూ.25 వేలు వేతనంగా ఇస్తున్నారని, హోంగార్డుల కుటుంబ సభ్యులకు ఆరోగ్య బీమా(Health Insurance) ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పోలీస్ నియామకాల్లో నిబంధనలు సడలించి.. కోటాను పెంచాలని సీపీఐ నేత రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు.
Next Story