హిజ్రాలు, వైసీపీ గూండాలతో దీక్ష భగ్నం చేస్తారా?: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

by Seetharam |   ( Updated:2023-12-19 10:05:17.0  )
SomiReddy
X

దిశ, డైనమిక్ బ్యూరో : దేశంలోనే అతిపెద్ద కుంభకోణం నెల్లూరు జిల్లాలో జరుగుతోంది. రూ.వేల కోట్ల ఖనిజాలను దోచేస్తున్నారు అని మాజీమంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. వైఎస్ భారతికి ముడుపులు పంపాలని బహిరంగంగా చెబుతున్నారు అని చెప్పుకొచ్చారు. తాను సత్యాగ్రహ దీక్ష చేస్తుంటే హిజ్రాలు, వైసీపీ గూండాలను పంపి లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించారు అని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. రాజకీయాలు ఇంత దిగజారడం ఎన్నడూ చూడలేదు అని మండిపడ్డారు. అధారాలతో సహా ఫిర్యాదులు చేసినా పట్టించుకునే దిక్కులేదు అని మండిపడ్డారు. జెలిటిన్ స్టిక్స్, డిటోనేటర్ల డంప్‍ను చూపినా అధికారులు స్పందించలేదన్నారు. ఉద్యమం ఇంతటితో ఆపేదిలేదు అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హెచ్చరించారు.

Advertisement

Next Story