- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అవినాశ్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు

దిశ, వెబ్ డెస్క్: మాజీ ఎంపీ వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఎంపీ అవినాశ్ రెడ్డిని విచారించేందుకు సీబీఐ అధికారులు ఆయనకు నోటీసులు పంపారు. అయితే ఈ కేసుతో తమ క్లయింట్ కు ఎలాంటి సంబంధం లేదని, ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ అవినాశ్ తరఫు లాయర్లు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే బెయిల్ పిటిషన్ పై ఇవాళ విచారణ చేపట్టిన కోర్టు.. ఎంపీ అవినాశ్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
ఈ నెల 25న తుది తీర్పు ఇస్తామని, అప్పటి వరకు ఆయనను అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే రేపటి నుంచి ఈ నెల 25 వరకు సీబీఐ విచారణకు హాజరుకావాలని అవినాశ్ రెడ్డిని అదేశించింది. అలాగే విచారణ సమయంలో ప్రశ్నలను లిఖిత పూర్వకంగా ఇవ్వాలని, విచారణ మొత్తాన్ని వీడియో రికార్డు చేయాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది.
ఇవి కూడా చదవండి: అవినాశే సూత్రధారి.. హైకోర్టులో సీబీఐ వాదనలు