చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి మరో స్టార్ హీరో.. స్పెషల్ ఇన్విటేషన్ పంపిన TDP చీఫ్

by Satheesh |   ( Updated:2024-06-11 14:39:01.0  )
చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి మరో స్టార్ హీరో.. స్పెషల్ ఇన్విటేషన్ పంపిన TDP చీఫ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధమైంది. ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అబ్దుల్ నజీర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. కూటమి పక్ష నేతగా ఎన్నికైన చంద్రబాబు నాలుగో సారి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బుధవారం కృష్ణా జిల్లాలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు. బుధవారం 11.27 గంటలకు బాబు ఏపీ సీఎంగా ప్రమాణం చేయనున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్స కార్యక్రమానికి ప్రధాని మోడీ, కేంద్రమంత్రి అమిత్ షా, జనసేనాని పవన్ కల్యాణ్, బండి సంజయ్, చిరంజీవి తదితరులు హాజరువుతున్నారు.

ఈ క్రమంలోనే తన ప్రమాణ స్వీకారోత్స కార్యక్రమానికి రావాల్సిందిగా సౌత్ స్టార్ హీరో, తన మిత్రుడు రజినీకాంత్‌కు చంద్రబాబు స్పెషల్ ఇన్విటేషన్ పంపారు. ప్రమాణ స్వీకారోత్స కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొనాలని రజీనిని కోరారు. బాబు ఇన్విటేషన్‌తో రజినీ కాంత్ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. బుధవారం రజినీ కాంత్ ఏపీకి చేరుకుని అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. మరోవైపు బాబు ప్రమాణ స్వీకారోత్స కార్యక్రమానికి హాజరయ్యేందుకు మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సమేతంగా ఇప్పటికే ఏపీకి చేరుకున్నారు. రాత్రి అక్కడే బస చేయనున్నారు.

Advertisement

Next Story