- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇదిగో జగన్ చేసిన అభివృద్ధి.. వచ్చి చూడు.. షర్మిలకు సవాల్
దిశ, డైనమిక్ బ్యూరో: గత మూడు రోజుల క్రితం ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇచ్ఛాపురంలో పర్యటించిన విషయం అందరికి సుపరిచితమే. ఈ నేపథ్యంలో మాట్లాడిన వైఎస్ షర్మిల వైసీపీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలుగున్నర సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ చేసిన అభివృద్ధిని చూడడానికి తాను సిద్ధం అని.. డేట్, టైం మీరు చెప్పిన సరే తనను చెప్పమన్నా సరేనంటూ.. తనతో పాటు మీడియా, ప్రతిపక్ష నేతలు కూడా వస్తారని రాష్ట్రంలో చేసిన అభివృద్ధిని చూపించండి అంటూ వైవీ సుబ్బారెడ్డికి షర్మిల సవాల్ విశారు.
కాగా ఆ సవాల్ పైన వైసీపీ నేతలు ఎవరు స్పందించలేదు. కానీ వైసీపీ అభిమాని, కార్యకర్త అయిన ఓ వ్యక్తి స్పందించారు. షర్మిల శాస్త్రి ఏపీ లో అభివృద్ధి చూపించమన్నావ్ గా.. ఇప్పుడు రా.. బెజవాడ కృష్ణ లంకలో ఉన్న సీఎం జగన్ కట్టించిన రిటైనింగ్ వాల్.. 243 కోట్లతో నాలుగున్నర కిలో మీటర్ల మేర వర్షాలు, వరదల కారణంగా ముంపు గురవుతున్న బాధితులను ఆదుకోవడానికి సీఎం జగన్ కట్టించిన రిటైనింగ్ వాల్ ఇదే.. రా చూపిస్తా అభివృద్ధి అంటూ వైఎస్ షర్మిల వ్యాఖ్యలకు ధీటుగా ఘాటైన సమాధానం ఇచ్చారు.
చూడు గోడ.. ఇది గ్రాఫిక్స్ కాదు అని పేర్కొన్న ఆ వ్యక్తి చంద్రబాబుకు గ్రాఫిక్స్ చూపించడం అలవాటని.. జగన్ కు గ్రాఫిక్స్ చూపించే అలవాటు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చూడు రిటైనింగ్ వాల్.. కళ్ళు కనిపించడం లేదా అని షర్మిలను ప్రశ్నించారు. కళ్ళు కనిపించకపోతే ఆరోగ్యశ్రీ కింద కంటి ఆపరేషన్ చేపించమంటావా..? అని ఎద్దేవ చేశారు.
చంద్రబాబు గ్రాఫిక్స్ అని జగన్ రియాలిటీ అని ధ్వజమెత్తారు. ఏ స్టేట్ కి అయిన వస్తాను అన్నావ్ గా.. ప్లేస్ నువ్వు చెప్పిన సరే నన్ను చెప్పమన్నా సరే.. టైం నువ్వు చెప్పిన సరే నన్ను చెప్పమన్నా సరే సింగిల్ హ్యాండ్ సీఎం జగన్ అంటూ బాలయ్య రేంజ్ లో డైలాగ్ చెప్తూ వీడియోని X లో పోస్ట్ చేశారు.