Heavy Temperature: ఠారెత్తిస్తున్న ఎండలు..అల్లాడిపోతున్న జనం

by srinivas |   ( Updated:2023-05-14 11:07:30.0  )
Heavy Temperature: ఠారెత్తిస్తున్న ఎండలు..అల్లాడిపోతున్న జనం
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచి భారీగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. వడగాల్పులు కూడా తీవ్రంగా వీస్తున్నాయి. దీంతో ప్రజలు ఇంట్లో నుంచి బయటకు వచ్చేందుకు హడలిపోతున్నారు. ఎండల తీవ్రత ఆదివారం, సోమవారం ఎక్కువగా ఉంటాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

ఈ నేపథ్యంలో విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45°C - 47°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు సోమవారం 144 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 161 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఎండ ప్రభావం నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు జాగ్రత్తలు పాటించాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

Also Read..

AP Politics: ఆ తర్వాతే ముఖ్యమంత్రి పదవి?

Advertisement

Next Story

Most Viewed