Nara Chandrababu Naidu : చంద్రబాబుకు అనారోగ్య సమస్యలు.. హెల్త్ బులిటెన్ విడుదల

by Javid Pasha |   ( Updated:2023-10-14 10:34:31.0  )
Nara Chandrababu Naidu : చంద్రబాబుకు అనారోగ్య సమస్యలు.. హెల్త్ బులిటెన్ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు కీలక నివేదిక విడుదల చేశారు. చంద్రబాబు ఛాతీ, చేతులు, మెడపై దద్దుర్లు, స్కిన్ అలెర్జీ ఉన్నట్లు హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్నారు. చంద్రబాబు గడ్డం, వీపుపై దద్దుర్లు, స్కిన్ అలెర్జీ ఉన్నట్లు నిర్ధారించారు. డీహైడ్రేషన్ సమస్యతో కూడా చంద్రబాబు బాధపడుతున్నారని, డీహైడ్రేషన్ వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తకుండా చల్లని వాతావరణంలో ఉంచేలా చూడాలని జైలు అధికారులకు వైద్యులు సూచించారు.

చంద్రబాబుకు ఐదు రకాల మందులను వైద్యులు సిఫార్సు చేశారు. జైలు అధికారులు చంద్రబాబు ఆరోగ్యం బాగానే ఉందని చెబుతుండగా.. ప్రభుత్వ డాక్టర్ల నివేదిక మాత్రం దానికి భిన్నంగా ఉంది. 12వ తేదీన చంద్రబాబును పరీక్షించిన రాజమండ్రి ప్రభుత్వ వైద్యులు.. 13వ తేదీన జైలు అధికారులకు ఓ రిపోర్ట్ ఇచ్చారు. ఇవాళ ఈ రిపోర్ట్ బయటపడింది. డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా జైలు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదని చంద్రబాబు కుటుంబసభ్యులు, టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Next Story

Most Viewed