- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఏపీ డీజీపీగా హరీష్‌కుమార్ గుప్తా.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

దిశ, వెబ్ డెస్క్: ఏపీ డీజీపీగా హరీష్‌కుమార్ గుప్తా(AP DGP Harish Kumar Gupta) నియామకం అయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం(Ap Government) ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ(Vigilance Enforcement DG)గా సేవలు అందిస్తున్నారు. 1992 బ్యాచ్‌కు చెందిన హరీష్‌కుమార్ గుప్తాను గత ఎన్నికల ముందు డీజీగా ఎన్నికల సంఘం నియమించింది. అయితే ఈ నెల 31న డీజీపీ ద్వారకా తిరుమలరావు(DGP Dwaraka Tirumala Rao) పదవీకాలంముగియనుంది. ఈ నేపథ్యంలో ఆ స్థానంలో హరీష్‌కుమార్ గుప్తాను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది.
అయితే ఏపీ కొత్త డీజీపీ ఎంపికపై అభ్యంతరం వ్యక్తమైంది. డీజీపీ ఎంపిక విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను ప్రభుత్వం పాటించలేదని పిటిషన్ హైకోర్టును ఆశ్రయించారు. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సోమవారం మధ్యాహ్నం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఇరువర్గాలు వాదనలు వినిపించారు. డీజీపీ ఎంపిక విషయంలో యూపీఎస్సీ నిబంధనలు పాటించలేదని పిటిషనర్ తరపున వాదనలు వినిపించారు. రూల్స్ మేరకు అన్ని అర్హతలున్న సీనియర్ ఐపీఎస్ అధికారుల లిస్టును ప్రభుత్వం యూపీఎస్సీకి రిఫర్ చేయలేదని తెలిపారు. ముగ్గురు అధికారులతో కూడిన జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి యూపీఎస్సీ పంపినా వారిలో ఎవరికి కూడా ప్రభుత్వం అవకాశం ఇవ్వడంలేదని తెలిపారు. అంతేకాకుండా జూనియర్లకు ప్రాధాన్యతమిస్తోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే పిటిషనర్ తరపున వాదనలు విన్న ధర్మాసనం.. డీజీపీ ఎంపికపై అభ్యంతరాలుంటే సుప్రీంకోర్టు వెళ్లాలని సూచించింది. అలాగే పిటిషనర్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను కోర్టు డిస్మిస్ చేసింది. డీజీపీ ఎంపిక విషయంలో నెలకొన్న ఉత్కంఠకు ధర్మాసనం తీర్పుతో తెరపడింది.
దీంతో ఏపీ ప్రభుత్వానికి లైన్ క్లియర్ అయింది. రాష్ట్ర కొత్త డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తాను నియమించింది. తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయన డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు హరీశ్ కుమార్ గుప్తాకు పలువురు అధికారులు ఇప్పటికే శుభాకాంక్షలు తెలిపారు.