Breaking News: నీ ముసలి కన్నీళ్లను ప్రజలు నమ్మరు.. గురజాల మాల్యాద్రి

by Indraja |
Breaking News: నీ ముసలి కన్నీళ్లను ప్రజలు నమ్మరు.. గురజాల మాల్యాద్రి
X

దిశ వెబ్ డెస్క్: నేడు టీడీపీ అధికార ప్రతినిధి గురజాల మాల్యాద్రి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పెన్షన్ల పంపిణీపై సజ్జల రామకృష్ణ మరో కట్టుకథ అల్లారని ఆరోపించారు. అలానే తమ దుష్ట లక్షణాలను టీడీపీకి అంటగట్టి చెప్పిన అబద్దమే మళ్ళీ మళ్ళీ చెప్తున్నారని మండిపడ్డారు. ఈ రోజు పెన్షన్ పంపిణీ ఆలస్యం కావడానికి జగన్మోహన్ రెడ్డి కారణం కాదా అని ప్రశించారు.

ఈ నెల 28వ తేదీన అంటే మార్చి 28వ తేదీకి ఎన్నికల కమిషన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని.. అయినా ఏప్రిల్ 3వ తేదీ నుండి పెన్షన్ల పంపిణీ జరుగుతుందని జగన్ రెడ్డి కుటుంబ నిర్వాహణలో నడుస్తున్న దినపత్రికలో మార్చి 28వ తేదీ వార్త వెలుగు చూసిందని.. ఎందుకు ఎన్నికల సంఘం నుండి అధికారిక ప్రకటన రాకముందే అలా ప్రచురించారు అని ప్రశ్నించారు. ఒకప్పుడు నువ్వు కూడా ఆ దినపత్రికలో పని చేసిన వాడివే కదా.. ఈ వార్త మీడియాలో రావడం నిజం కాదంటావా..? అని సజ్జల రామకృష్ణారెడ్డిని ప్రశ్నించారు.

ఇక ఒకటో తేదీ నుండి పెన్షన్ ఇవ్వడానికి డబ్బులు లేవు అందుకే ఆ నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. కాంట్రాక్టర్ల దగ్గర కమీషన్ పుచ్చుకుని అప్పుగా తీసుకువచ్చిన వేల కోట్ల రూపాయలను ఆ కాంట్రాక్టర్లకు దోచిపెట్టారని మండిపడ్డారు. అవ్వాతాతలపై అంత అభిమానం ఉన్నవాడివే అయితే వృధాప్య పెన్షన్ పై ఆధారపడిన వాళ్ళ గురించి ఆలోచించిన వాడివే అయితే.. చీఫ్ సెక్రటరీగా ఉంది కడప జిల్లాకు చెందిన మీ మనిషే కదా.. అలానే మీ దగ్గర సచివాలయ సిబ్బంది ఉంది, ప్రభుత్వ ఉద్యోగులు టీచర్స్ ఉన్నారు.. వాళ్ళందరిని ఇంటింటికి పంపి పెన్షన్ పంపిణీ చెయ్యొచ్చుకదా అని మాల్యాద్రి ప్రశించారు.

బాబాయ్ గొడ్డలి పోటు, కోడికత్తి డ్రామా లాంటిదే ఈ వాలంటీర్ల్ డ్రామా కూడా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో కూడా ఇలానే సొంత బాబాయ్ ని క్రూరంగా నరికి చంపి, గుండెపోటుతో మృతి చెందారని మీడియా కథనాలు సృష్టించారాని, ఆ తరువాత నిజం బయటపడితే నారసుర రక్త చిత్ర అని ప్రచారం చేశారని, చివరికి చనిపోయిన వివేకా కూతురు నిజం తెలుసుకుని న్యాయంకోసం పోరాడుతుంటే వివేకాని సొంత కూతురు సునీత హత్య చేసిందని మరో అబద్దం ఆడారని.. దీనితో ప్రజలు నీ మొసలి కన్నీళ్లను నమ్మడం మర్చిపోయారని సీఎం జగన్మోహన్ రెడ్డిని మాల్యాద్రి ఎద్దేవ చేశారు.

Advertisement

Next Story

Most Viewed