- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలో ప్రతి రోజూ అప్పులే.. తేల్చేసిన కాగ్ రిపోర్టు
దిశ, వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వం అప్పులు పాలు అయిందన్న విషయాన్ని మరోసారి కాగ్ గుర్తు చేసింది. సంక్షేమ పథకాల పేరుతో సీఎం జగన్ వేల కోట్లు లబ్ధిదారుల అకౌంట్లలోకి వేస్తున్న విషయాన్ని గుర్తు చేసింది. అయితే ఈ డబ్బులన్నీ అప్పలేనని కాగ్ తేల్చింది. ఏడాది పొడవునా ప్రభుత్వం అప్పులు తీసుకుంటోందని కాగ్ తన నివేదికలో వెల్లడించింది. ఈ మేరకు తన నివేదకలో అప్పుల వివరాలను స్పష్టం చేసింది. సంవత్సంలో 365 రోజలుంటే 341 రోజుల పాటు ఏదో రూపంలో ప్రభుత్వం అప్పు చేస్తోందని కాగ్ వెల్లడించింది. సంక్షే పథకాలు, అభిృవృద్ధికి చేస్తున్న ఖర్చులు రాష్ట్ర అదాయం, కేంద్రం గ్రాంట్లు సరిపోకపోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేసింది. అంతేకాదు పథకాల అమలు కోసం కేంద్రంతో పాటు ఇతర సంస్థల నుంచి ప్రభుత్వం ప్రతి నెలా అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని స్పష్టం చేసింది. 2022-2023 మధ్య ఓడీ కింద ఏపీ ప్రభుత్వం రూ.57,066 కోట్లు అప్పులు తీసుకుందని తన నివేదికలో కాగ్ వెల్లడించింది.
దీంతో ఏపీ ప్రభుత్వం చేస్తున్న అప్పులపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను కాగ్ నివేదిక తేటతెల్లం చేసినట్లైంది. ఇప్పటికే రాష్ట్ర అప్పులపై ప్రతిపక్ష నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అటు ప్రజలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాగ్ నివేదిక మరోసారి చర్చకు తెరతీసింది.
Read More..
రాయలసీమ పౌరుషం ఉంటే నా చాలెంజ్ స్వీకరించు.. మాజీ మంత్రి అనిల్ కుమార్