మీరు నిరూపించండి.. నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా: Ms Raju

by srinivas |   ( Updated:2023-04-22 11:22:34.0  )
మీరు నిరూపించండి.. నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా: Ms Raju
X

దిశ, డైనమిక్ బ్యూరో: దళితులను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అవమానించారని వైసీపీ అసత్య ప్రచారం చేస్తూ నీచ రాజకీయాలకు పాల్పడుతుందని టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు ఆరోపించారు. నారా లోకేశ్ దళితులను అవమాన పరిచినట్లు నిరూపిస్తే రాజకీయాలకు నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. లేని పక్షంలో వైసీపీ దళితులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి సురేశ్ దళిత ద్రోహి అని ఆరోపించారు. జగన్ ప్రభుత్వంలో దళితులపై దమనకాండ జరుగుతుంటే ప్రశ్నించని దద్దమ్మ మంత్రి ఆదిమూలపు సురేశ్ అని విమర్శించారు. చంద్రబాబు పాలనలో దళిత సంక్షేమంపై జగన్ దళిత వ్యతిరేక విధానాల మీద బహిరంగ చర్చకు వచ్చే దమ్ము వైసీపీ దళిత మంత్రులకు ఉందా అని టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎంఎస్ రాజు సవాల్ విసిరారు.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story