- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పంగోలియన్ స్మగ్లింగ్.. అటవీశాఖ అధికారులపై రాళ్ల దాడి
by srinivas |

X
దివ, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లా గొట్టిపాళ్లలో పంగోలియన్ స్మగ్లింగ్ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ముఠా సభ్యుడిని అదుపులోకి తీసుకున్నారు. కారులో గుంటూరుకు తరలిస్తుండగా ముఠా సభ్యుడి బంధువులు ఆందోళనకు దిగారు. అటవీ శాఖ అధికారుల కారును అడ్డుకున్నారు. వాహనాలు అడ్డుపెట్టి వాగ్వాదానికి దిగారు. అటవీ శాఖ అధికారుల కారుపై రాళ్లు రువ్వారు. కర్రలు, గొడ్డలతో దాడికి దిగారు. ఈ దాడిలో ఇద్దరు అటవీ అధికారులకు గాయాలయ్యాయి. దీంతో వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అటవీ శాఖ కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనపై వెల్దుర్తి పోలీసులకు అటవీ శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
Next Story