ముందు చంద్రబాబు ఇంటిని కూల్చివేయ్.. పవన్‌కు అంబటి స్ట్రాంగ్ కౌంటర్

by srinivas |   ( Updated:2024-09-05 17:01:07.0  )
ముందు చంద్రబాబు ఇంటిని కూల్చివేయ్.. పవన్‌కు అంబటి స్ట్రాంగ్ కౌంటర్
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో చెరువులు ఆక్రమించి అక్రమంగా నిర్మించిన కట్టణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే. అయితే బుడమేరు ఆక్రమణకు గురైందని, అందువల్లే విజయవాడకు వరద వచ్చాయని, రాష్ట్రంలోనూ హైడ్రా చర్యలు చేపట్టాలన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై అంబటి రాంబాబు స్పందించారు. బఫర్ జోన్‌లో ఉన్న చంద్రబాబు ఇంటిని ముందు కూల్చివేయ్ పవన్ అని వ్యాఖ్యానించారు. వరదలు వస్తే కరకట్ట మునిగిపోతుందని తెలిసినా చంద్రబాబు జఫర్ జోన్‌లో ఉంటున్నారని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ సీఎంగా వ్యవహరించేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బుడమేరులో ఉన్న ఆక్రమణల కంటే ముందు బఫర్ జోన్‌లో ఉన్న చంద్రబాబు ఇంటిని కూల్చి శభాష్ అనిపించుకో అని సలహా ఇచ్చారు. సీఎం చంద్రబాబు అసమర్దత వల్లే విజయవాడకు వరదలు వచ్చాయని ఆరోపించారు. వాతావరణ శాఖ హెచ్చరించినా అధికారులను చంద్రబాబు అప్రమత్తం చేయలేదని విమర్శించారు. చంద్రబాబు చేసిన తప్పును కప్పించుకునేందుకే వైసీపీపై దుష్ప్రచారం చేస్తున్నారని అంబటి మండిపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed