- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫేక్ కంపెనీకి రూ. 50 వేల కోట్ల విలువైన భూములు.. సజ్జల సంచలన వ్యాఖ్యలు
దిశ వెబ్ డెస్క్: 50 వేల కోట్ల రూపాయల విలువైన 800 ఎకరాల భూములను ఫేక్ కంపెనీకి ఇవ్వాలని ఆనాటి సీఎం చంద్రబాబు చూశారని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఆ 800 ఎకరాలు ప్రభుత్వానివేనని హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘చంద్రబాబు ప్రభుత్వంలో హయాంలో 2003లో 'ఐఎంజీ భారత'కు ఎకరం రూ.50 వేల చొప్పున 800 ఎకరాలు కేటాయించారు. ఇప్పుడు ఆ భూములు సర్కారువే అని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ భూముల కేటాయింపులను రద్దు చేస్తూ వైఎస్ సర్కారు జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది.’అని సజ్జల పేర్కొన్నారు.
‘ఐఎంజీ భారత అనే కంపెనీని 2003 ఆగస్టు 5న రిజిస్టర్ చేశారు. ఐఎంజీ భారతకి అధినేత అహోబలరావు అలియాస్ బిల్లీరావు. క్రీడా మైదానాలు కట్టి, 2020 ఒలింపిక్స్ కోసం క్రీడాకారులను సిద్ధం చేస్తామంటూ కంపెనీ ప్రచారం చేసింది. కంపెనీ ప్రారంభమైన నాలుగు రోజులకే ఉమ్మడి ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలిలో సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాలు, సరూర్ నగర్ మండలం మామిడిపల్లిలో విమానాశ్రయానికి అత్యంత చేరువలో 450 ఎకరాలను కంపెనీకి కేటాయించింది. ఆ సమయంలో అక్కడ సుమారు ఎకరం రూ. 10 కోట్లు ధర పలుకుతుందిం. ఎకరం రూ.50 వేల వంతున కేటాయిస్తూ 2003 ఆగస్టు 9న ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం కూలిపోయింది. 2004 వైఎస్సార్ అధికారంలోకి రాగానే ఐఏంజీకి కేటాయించిన భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంది. ఎలాంటి అనుభవం లేని సంస్థకు ఎలా అప్పగిస్తారంటూ చంద్రబాబు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. అయితే భూ కేటాయింపు రద్దును సవాల్ చేస్తూ సదరు ఐఎంజీ భారత హైకోర్టును ఆశ్రయించింది. అప్పటి నుంచి స్టేటస్ కోలో ఉండిపోయింది. సుదీర్ఘ వాదోపవాదాల తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థిస్తూ ఉత్తర్పులు జారీ చేసింది. 2006 నుంచి నడుస్తున్న ఈ కేసు ఎట్టకేలకు కొలిక్కి రావడంతో రూ. వేల కోట్ల భూమి ప్రభుత్వ ఖాతాలో పడింది.’ అని సజ్జల తెలిపారు.
Read More..