- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
సత్తెనపల్లి మున్సిపాలిటీలో ఫోర్జరీ సంతకం కలకలం.. ఫోలీసులకు ఫిర్యాదు
దిశ, పల్నాడు: పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఓ వ్యక్తి ఏకంగా మున్సిపల్ కమిషనర్, సర్వేయర్ల సంతకాలనే ఫోర్జరీ చేశారు. ఓ నకిలీ ఎండార్స్మెంట్ లెటర్‌ని సృష్టించి భూమి రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నారు. ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి రావడంతో, అప్రమత్తమైన మున్సిపల్ అధికారులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అసలేం జరిగింది..
సత్తెనపల్లి పట్టణానికి చెందిన గొల్లపల్లి వెంకట్రావ్‌కు స్థానికంగా ఖాళీ స్థలం ఉంది. మున్సిపల్ కమిషనర్ షమ్మీ, టౌన్ సర్వేయర్ రఫీ పేరుతో ఈ ఏడాది మార్చి 26న పట్టణ ప్రణాళిక విభాగం నుంచి ఎండార్స్మెంట్ ఇచ్చినట్లుగా ఓ నకిలీ సర్ధిఫికెట్‌ను సృష్టించారు. దీని ఆధారంగా సుమారు 80 సెంట్ల భూమిని మైలవరంలో రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ డాక్యుమెంట్ నెంబరు డాక్యుమెంట్ నెంబరు 167/2024గా ఉంది. కాగా, ఆ సర్వే నెంబర్‌లో వేర్వేరు వ్యక్తులు ఉండటంతో వెంకట్రావు భూమి రిజర్వేషన్ అయిన విషయం బయటకు వచ్చింది. విషయం అధికారులకు చేరడంతో, విచారించగా ఫేక్ ఎండార్స్మెంట్ లెటర్ వ్యవహారం బయటపడింది. పురపాలక కమిషనర్, సర్వేయర్ సంతకాలు సదరు వ్యక్తి ఫోర్జరీ చేసినట్లుగా అధికారుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీంతో వెంకట్రావ్‌పై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ సర్వేయర్ షేక్.రఫీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.