Good News: ఒకేసారి నాలుగు నోటిఫికేషన్లు

by srinivas |   ( Updated:2024-03-07 10:09:32.0  )
Good News: ఒకేసారి నాలుగు నోటిఫికేషన్లు
X

దిశ, వెబ్ డెస్క్: ఎన్నికల వేళ నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఒకేసారి నాలుగు ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఈ నాలుగు నోటిఫికేషన్ల ద్వారా మొత్తం 49 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. 3 ఎలక్ట్రికల్ ఇన్ స్పెక్టర్ పోస్టులతో పాటు ఫిషరీస్ డెవలప్ మెంట్ ఆఫీసర్-4, స్టాటిస్టికల్ ఆఫీసర్-5, ఫారెస్ట్ రేంజ్ అధికారి-37 పోస్టులకు వేర్వేరుగా ఏపీపీఎస్సీ నాలుగు నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఎలక్ట్రికల్ ఇన్ స్పెక్టర్ పోస్టులకు మార్చి 21 నుంచి ఏప్రిల్ 10 వరకూ దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఫారెస్ట్ రేంజ్ అధికారి పోస్టులకు ఏప్రిల్ 15 నుంచి మే 15 వరకూ నిరుద్యోగులు ఆన్ లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకు ఏప్రిల్ 18 నుంచి మే 8 వరకూ దరఖాస్తులను స్వీరించనున్నారు. ఫిషరీస్ డెవలప్ మెంట్ ఆఫీసర్ పోస్టులకు ఏప్రిల్ 23 నుంచి మే 13 వరకూ నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవాలని ఏపీపీఎస్సీ ప్రకటించింది.

ఇవే కాకుండా వివిధ శాఖలో ఖాళీగా ఉన్న 81 గ్రూప్ -1 పోస్టులకు సైతం గతంలో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పోస్టులకు మార్చి 17న అధికారులు ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నారు. తాజాగా ప్రకటించిన పోస్టుల దృష్ట్యా గ్రూప్-1 పిలిమ్స్ పరీక్ష తేదీలో ఎలాంటి మార్పులు ఉండవని అధికారులు స్పష్టం చేశారు. నిరుద్యోగులు ఈ విషయాన్నిగమనించాలని ఏపీపీఎస్సీ సూచించింది.

Advertisement

Next Story