జీబీ ​సిండ్రోమ్.. ఇంజక్షన్ చాలా ఖరీదే!

by Anil Sikha |   ( Updated:2025-02-17 11:43:49.0  )
జీబీ ​సిండ్రోమ్.. ఇంజక్షన్ చాలా ఖరీదే!
X

దిశ, డైనమిక్​ బ్యూరో : గులేరియా బాలి సిండ్రోమ్​.. ఇది ఇప్పుడు తెలుగు రాష్ర్టాలను వణికిస్తోంది.ఈ వ్యాధి బారిన పడి ఇప్పటికి ఏపీలో ఇద్దరు మృతి చెందారు. జీజీహెచ్​లలో పలువురు చికిత్స పొందుతున్నారు. అయితే ఈ వ్యాధి సోకిన వారికి ఇంట్రా వీనస్​ఇమ్యునో గ్లోబిన్​అనే ఇంజక్షన్​వాడతారు. అది చాలా ఖరీదైనది. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో సమావేశం అనంతరం ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్​ ఆ వివరాలను వెల్లడించారు. ఈ ఇంక్షన్​ ఒక్కొక్కటి రూ.20 వేలు ఉంటుందన్నారు. ఒక పేషెంట్​కు రోజుకు ఐదు ఇంజక్షన్లు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఇలా ఐదురోజులు ఇంజక్షన్​ వాడాలి. అంటే రోజుకు లక్ష .. ఐదురోజులకు ఐదు లక్షల రూపాలు ఖరీదు చేసే ఇంజక్షన్​ ఇవ్వాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో ప్రభుత్వ ఆస్పత్రులకు రోగులు వస్తున్నారని తెలిపారు. దీనిని ఎన్టీఆర్​ వైద్యసేవలో కూడా చేర్చామన్నారు. జీజీహెచ్​లలో 740 ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. గోడౌన్లలో 429 ఇంజక్షన్లు నిల్వ ఉన్నాయని తెలిపారు.

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story