వైసీపీలో జగన్ తప్ప ఎవరు మిగలరు.. అలా చేసి టీడీపీలోకి వస్తే స్వాగతిస్తాం:ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు

by Mahesh |   ( Updated:2024-08-29 07:37:04.0  )
వైసీపీలో జగన్ తప్ప ఎవరు మిగలరు.. అలా చేసి టీడీపీలోకి   వస్తే స్వాగతిస్తాం:ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు
X

దిశ, వెబ్ డెస్క్: 2024 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన టీడీపీ పార్టీ కూటమితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఈ ఎన్నికల్లో ఎవరూ ఉహించని విధంగా దారుణమైన ఓటమిని చవిచూసిన వైసీపీ పార్టీని వీడేందుకు నాయకులు, నేతలు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో పలువురు టీడీపీ, జనసేన పార్టీలో చేరడానికి సంప్రదింపులు జరిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే రాజ్యసభ సభ్యులు అయిన మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు ఈ రోజు వైసీపీ పార్టీకి, రాజ్యసభ ఎంపీ పదవులకు ఏక కాలంలో రాజీనామా చేశారు. అయితే వీరిద్దరు త్వరలో టీడీపీలో చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

కాగా ఈ వార్తలపై మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయిందిని.. ఆ పార్టీని ప్రజలు తిరస్కరించారని.. వైసీపీ మునిగిపోయే నావ కాదని.. ఇప్పటికే మునిగిపోయే నావ అని ఎద్దేవా చేశారు. అలాగే వైసీపీలో జగన్‌ తప్ప ఎవరూ మిగలరని.. పదవులకు రాజీనామా చేసి టీడీపీలో చేరతామంటే స్వాగతిస్తామని.. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story