పది రూపాయలు ప్రజలకిచ్చి వంద రూపాయలు దోచిన గజదొంగ జగన్

by Ramesh Goud |   ( Updated:2024-02-05 14:29:05.0  )
పది రూపాయలు ప్రజలకిచ్చి వంద రూపాయలు దోచిన గజదొంగ జగన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: పది రూపాయలు ప్రజలకు ఇచ్చి వంద రూపాయలు దోచిన గజదొంగ జగన్మోహన్ రెడ్డి అని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించాడు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మాడుగులలో ఏర్పాటు చేసిన రా.. కదలి రా బహిరంగ సభకు చంద్రబాబు హాజరయ్యారు. ఈ సభలో ఆయన మట్లాడుతూ..రా.. కదలి రా అని పిలిస్తే ఉదృతంగా కదిలి వచ్చారని, ఈ సభలో ఉన్న జనాన్ని చూస్తుంటే టీడీపీ, జనసేన ప్రభుత్వం వచ్చినట్లే కనిపిస్తుందన్నారు. ఈ మాడుగుల సభ చూస్తే.. తాడేపల్లి పిల్లికి జ్వరం వస్తుందని, ఇకపై బయటకి కూడా వెళ్లదని అన్నారు.

ఎన్నికలకు ఇంకా 64 రోజులే ఉందని, తర్వాత తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం వస్తుందని, వైసీపీ ఇంటికి పోతుందని అన్నారు. ఈ ఎన్నికలు రాజకీయాల కోసం కాదని, రాష్ట్ర ప్రజల కోసం, ప్రజల బంగారు భవిష్యత్తు కోసమని అన్నారు. సైకో పాలన అంతం చేస్తే తప్ప ప్రజలకు భవిష్యత్తు ఉండదని అన్నారు. 124 సార్లు బటన్ నొక్కానని జగన్ చెబుతున్నారని, నొక్కుడు కాదు.. నీ బొక్కడు గురించి మాట్లడు అని అన్నారు. బటన్ నొక్కడు వల్ల విద్యుత్ చార్జీలు పెంచి 64 వేల కోట్లు ప్రజలపై భారం పడిందన్నారు. జగన్ నొక్కుడు మూలంగానే ఆర్టీసీ చార్జీలు పెరిగాయని..ఆకరికి చెత్తపై కూడా పన్ను వేసే దుస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చారని మండిపడ్డారు. జ్యాబ్ క్యాలెండర్ కి, మద్య నిషేదానికి, సీపీఎస్ రద్దు లాంటివి నువ్వు ఇచ్చిన హామీలే కదా.. వాటికోసం ఎందుకు బటన్ నొక్కలేదని ప్రశ్నించారు. గుంతల పడ్డ రోడ్లకి ఎందుకు బటన్ నొక్కలేదని, అలాగే డీఎస్సీ కోసం ఎందుకు బటన్ నొక్కలేదని.. అందుకే జాబు రావాలంటే బాబు రావాలి అని పిలుపునిచ్చారు.

జగన్ రెడ్డి రాష్ట్రంలోని సంపద దోచుకోవడం కోసం కొన్ని బటన్ లు నొక్కాడని, మైనింగ్ బటన్, ఇసుక బటన్ నొక్కి తాడేపల్లికి తరలించాడని ఆరోపించాడు. అలాగే ధనదాహంతో ఉత్తరాంధ్రను దోచేశాడని, రాష్ట్రంలోని కొండలను అనకొండలాగా మింగేశాడని దుయ్యబట్టారు. రుషికొండపై 500 కోట్లతో ప్యాలెస్ కట్టుకున్నాడని, విశాఖలో 40 వేల కోట్లు దోచుకున్నాడని, విశాఖను గంజాయి కేంద్రంగా, క్రైమ్ సిటీగా మార్చారని ఆరోపించారు. జగన్ కి ఉత్తరాంధ్రపై ఏ మాత్రం ప్రేమ లేదని, లులూ కంపెనీ, అదానీ డేటా సెంటర్ లాంటివి రాకుండా తరిమికొట్టారని అన్నారు. ఇలాంటి జగన్ మోహన్ రెడ్డికి ఓటు వేస్తారా అని ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

Read More..

సైకో పాలనను అంతం చేస్తేనే.. రాష్ట్రానికి భవిష్యత్తు: సీఎం జగన్‌పై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు

Advertisement

Next Story

Most Viewed