- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేపటిలోగా భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తా.. వైసీపీ రెబల్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్దీ ఏపీలో రాజకీయాల రూపు మారుతోంది. ఏ నాయకుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియని పరిస్థితులు నెలకొంటున్నాయి. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అటు అధికార పక్షం..ఇటు ప్రతిపక్షాల అధినేతలు అభ్యర్థుల ఎంపికలో తలమునకలై ఉన్నారు. ఈ క్రమంలోనో ఎన్టీఆర్ జిల్లా వైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన ఆదివారం నియోజకవర్గ, మండల స్థాయి నాయకులతో సమావేశం నిర్వహించారు.
రేపు ఐతవరంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నట్లుగా తెలిపారు. అందరి అభిప్రాయాలు తీసుకుని మీడియా సమావేశం నిర్వహించి తన తుది నిర్ణయాన్ని వెల్లడిస్తానని వసంత కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. కాగా, ఇటీవలే సీఎం జగన్ మైలవరం అసెంబ్లీ ఇన్‌ఛార్జిగా జడ్పీటీసీ సభ్యుడు సర్నాల తిరుపతిరావు యాదవ్‌ను నియమించారు. దీంతో స్థానిక ఎమ్మెల్యే, ఆయన అనుచర వర్గం జగన్ తీరు పట్ల తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. దీంతో వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీని వేడేందుకే నిర్ణయించుకున్నారని సమాచారం.