Assembly Sessions :రేపటి నుంచి AP అసెంబ్లీ సమావేశాలు.. భారీ ఏర్పాట్లు!

by Jakkula Mamatha |
Assembly Sessions :రేపటి నుంచి AP అసెంబ్లీ సమావేశాలు.. భారీ ఏర్పాట్లు!
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ అసెంబ్లీ సమావేశాలు(Assembly Meetings) రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. తొలిరోజు గవర్నర్(Governor) ప్రసంగం ఉండనుంది. ఆ తర్వాత జరిగే BAC సమావేశంలో సభను ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఈ నెల 25వ తేదీన చర్చ జరగనుంది. 26వ తేదీన శివరాత్రి, 27న ఎమ్మెల్సీ ఎన్నికల(MLC Election) నేపథ్యంలో సభ ఉండదు. 28న సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మార్చి 3 నుంచి బడ్జెట్ చర్చ జరగనుంది.

అసెంబ్లీ సమావేశాల(Assembly Meetings) నేపథ్యంలో ప్రాంగణంలో రాకపోకలు, ప్రవేశాలపై ఉన్న నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు మంత్రులు(Ministers), ఎమ్మెల్యే(MLAs)లు, ఎమ్మెల్సీ, మీడియా, సందర్శకులు, పోలీసు సిబ్బందికి ప్రత్యేక పాసులు జారీ చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా పాసులు ఉన్నవారిని మాత్రమే అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించనున్నట్లు తెలుస్తోంది.

మండలి చైర్మన్, స్పీకర్, డిప్యూటీ స్పీకర్(Deputy Speaker), ముఖ్యమంత్రి(Chief Minister), డిప్యూటీ సీఎం(Deputy CM)కు మాత్రమే అసెంబ్లీ గేట్-1 నుంచి అనుమతి ఉంటుంది. గేట్-2 నుంచి మంత్రులకు మాత్రమే అనుమతి ఇస్తారు. గేట్-4 నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మాత్రమే అనుమతిస్తూ బులెటిన్ జారీ చేశారు. మండలి ఛైర్మన్, స్పీకర్, ముఖ్యమంత్రులు వచ్చి వెళ్లే కారిడార్‌లోకి ఇతరులెవరికీ అనుమతి లేదని స్పష్టం చేశారు.

Next Story