AP News:‘వారి కబంధ హస్తాల్లో చిక్కుకున్న ఉచిత ఇసుక’.. వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

by Jakkula Mamatha |
AP News:‘వారి కబంధ హస్తాల్లో చిక్కుకున్న ఉచిత ఇసుక’.. వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో టీడీపీ(TDP), వైసీపీ(YCP) నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో భాగంగా సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఉచిత ఇసుక విధానం అమలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉచిత ఇసుక విధానం(Free sand procedure) పై వైసీపీ నేతలు స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి(YCP MP Vijayasai Reddy) ఉచిత ఇసుక విధానం పై ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. టీడీపీ నాయకుల కబంధ హస్తాల్లో చిక్కుకున్న ఇసుకను విడిపించండి అని ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఈ క్రమంలో టీడీపీ పచ్చ ఇసుకాసురులు ప్రజల్ని హింసిస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఉచిత ఇసుక ఇస్తామంటూ ప్రజలను మోసం చేసిన చంద్రబాబు ఇప్పుడు తిరగబడండి అంటూ పిలుపునిస్తున్నారని మండిపడ్డారు. దీన్ని చూస్తుంటే సీఎంగా ఆయన ఫెయిల్ అయ్యారని చెప్పాల్సిన పని లేదని ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబుని పొగిడే పచ్చ మీడియా(Media) ప్రజల ఇబ్బందులను గమనించాలి అని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed