49 ఏళ్ళుగా చూస్తున్నా.. చంద్రబాబు అతి భయస్తుడు: మాజీ కేంద్రమంత్రి

by GSrikanth |
49 ఏళ్ళుగా చూస్తున్నా.. చంద్రబాబు అతి భయస్తుడు: మాజీ కేంద్రమంత్రి
X

దిశ, తిరుపతి: అసెంబ్లీ స్పీకర్‌పై ఎమ్మెల్యేలకు నమ్మకం లేదని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ అన్నారు. శనివారం తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో చంద్రబాబు జైల్లో.... జగన్ బెయిల్‌పై ఉన్నారని వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చాలా భయస్తుడు.. తమ్ముడికి సహాయం చేయడానికి కూడా చాలా భయపడతారు. మహిళా రిజర్వేషన్‌పై బీజేపీ చేస్తున్నది మ్యాజిక్ అని.. నమ్మడానికి ఏమీ లేదని.. ఎన్నికల స్టంట్ అని విమర్శించారు. మహిళా రిజర్వేషన్ టీటీడీలోనూ, సుప్రీంకోర్టు జడ్డ్ నియామకాల్లోనూ, ఐఏఎస్‌లో వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. 17వేల కోట్ల టీటీడీ నిధులు, బంగారం నిల్వలు ఎక్కడ పోయాయో టీటీడీ అధికారులు చెప్పాలన్నారు.

రూ.17వేల కోట్లను వడ్డీ కోసం ఇచ్చామంటున్నారని.. అది ఎక్కడ ఇచ్చారంటే మాత్రం టీటీడీ నుంచి సమాధానం లేదని అన్నారు. 49 ఏళ్ళుగా చంద్రబాబు తనకు తెలుసని.. ఆయన చాలా భయస్తుడని తెలిపారు. సొంత తమ్ముడికి మేలు చేసినా జనాలు ఏమి అనుకుంటారో అని సహాయం చేయకుండా ఉండే నైజం చంద్రబాబుది అని అన్నారు. వ్యక్తిగత కక్ష రాజకీయాలు మంచి కాదన్నారు. రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు ఎంతో కలిసి మెలసి ఉండేవారని చెప్పారు. అనుభవం లేకపోవడం వల్ల జగన్ ఇలాంటి చర్యలు తీసుకున్నారన్నారు. వైసీపీ తీసుకున్న నిర్ణయం చంద్రబాబుకే అనుకూలంగా మారిందని చింతామోహన్ వెల్లడించారు.

Advertisement

Next Story