బీజేపీలోకి చిరంజీవి.. స్పందించిన మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్

by srinivas |   ( Updated:2025-01-17 11:00:57.0  )
బీజేపీలోకి చిరంజీవి.. స్పందించిన మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్
X

దిశ, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) బీజేపీ(Bjp)లో చేరబోతున్నారని తెగ ప్రచారం జరుగుతోంది. ఢిల్లీలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy)తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చిరంజీవికి ప్రధాని మోడీ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. అంతేకాదు ప్రధాని మోడీ(Pm Modi)తో పాటుగా సమానంగా చిరంజీవి కలిసి నడిచారు. దీంతో చిరంజీవి కాషాయతీర్థం పుచ్చుకోబోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంపై చిరంజీవి గానీ, కిషన్ రెడ్డి గాని స్పందించలేదు. దీంతో ఈ ప్రచారానికి మరింత బలం పెరిగింది. బీజేపీ వైపు మెగాస్టార్ అడుగులు పడతాయనే చర్చ తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తిగా మారింది.


ఈ నేపథ్యంలో బీజేపీ మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్(Bjp former Mp TG Venkatesh) స్పందించారు. బీజేపీ, చిరంజీవి స్నేహ పూర్వక సంబంధాలున్నాయని తెలిపారు. తదుపరి విషయాలు తనకు తెలియవని చెప్పారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఈ ఏడు నెలలపాటు అద్భుతంగా పాలన చేసిందన్నారు. కర్నూలుకు హైకోర్టు బెంచ్ గతంలోనే వచ్చేదని, కొంత మంది న్యాయవాదులు ఆందోళన చేయడం వల్ల ఆగిపోయిందని తెలిపారు. హైకమాండ్ నిర్ణయంతోనే రాష్ట్రంలో అధ్యక్షుల పదవులు మారుతూ ఉంటాయని టీజీ వెంకటేశ్ స్పష్టం చేశారు.

Next Story

Most Viewed