మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసు: మాజీ మంత్రి పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

by srinivas |
మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసు: మాజీ మంత్రి పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసు(Madanapalli files burning case) విషయంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Former Minister Peddireddy Ramachandra Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ కేసులో ఇప్పటి వరకూ ఎందుకు చర్యలు తీసుకోలేదని, ఎప్పుడు తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపైనా పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని మండిపడ్డారు. రాష్ట్రంలో అసలు మహిళలకు రక్షణ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chief Minister Chandrababu Naidu) డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను, రాష్ట్రాభివృద్ధిని కూటమి ప్రభుత్వం మరిచిపోయిందని పెద్దిరెడ్డి విమర్శించారు.

Next Story

Most Viewed