పులివెందులలో ప్రజాదర్బార్... జగన్ దృష్టికి కీలక అంశం

by srinivas |
పులివెందులలో ప్రజాదర్బార్... జగన్ దృష్టికి కీలక అంశం
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పులివెందుల పర్యటన కొనసాగుతోంది. సొంత నియోజకవర్గానికి శనివారం వెళ్లిన ఆయన సోమవారం సైతం ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్బంగా నియోజకవర్గం పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయనను కలుస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ప్రజలకు జగన్ అందు బాటులో ఉన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వినతులను స్వీకరించారు. తనను కలిసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరిని జగన్ అప్యాయంగా పలికరిస్తూ వారికి ఫొటో అవకాశం కల్పిస్తున్నారు. ప్రధానంగా నియోజకవర్గానికి చెందిన మండల స్థాయి ప్రజా ప్రతినిధులంతా జగన్‌కు ఒకటే మొర పెట్టుకున్నారు. తమ ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల విషయాన్ని జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికలకు ముందే బిల్లులు చెల్లించి ఉంటే బాగుంటేది అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే పరిస్థితి ఏంది అనే విషయంపై చర్చించారు.

Advertisement

Next Story

Most Viewed