చంద్రబాబు కుట్రలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకు వాటా..!

by sudharani |
చంద్రబాబు కుట్రలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకు వాటా..!
X

దిశ, ఉత్తరాంధ్ర: చంద్రబాబు కుట్రలో బీజేపీ మాజీ శాసనసభ్యుడు విష్ణుకుమార్ రాజు భాగస్వామి అయ్యారని విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర నెడ్ క్యాప్ చైర్మన్ కె కె రాజు విమర్శించారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విశాఖ ఉత్తర నియోజకవర్గం మాజీ శాసనసభ్యుడు విష్ణుకుమార్ రాజు ఇటీవలే ఒక మీడియాలో ఇచ్చిన ఇంటర్వ్యూలో విశాఖ పరిపాలన రాజధాని ఏర్పాటుకు వ్యతిరేకంగా మాట్లాడడం చూస్తుంటే చంద్రబాబు కుట్రలో ఆయన కూడా భాగస్వామీ అయినట్లు తెలుస్తుందని అన్నారు. ఇదంతా టీడీపీ సీటు కోసం విశాఖపై విషం చిమ్ముతూన్నారనీ తెలిపారు.

పదవి వ్యామోహంతో విశాఖను రాజధానిగా వ్యతిరేకిస్తున్నారనీ వాఖ్యానించారు. పరిపాలన రాజధానికి విశాఖ అన్ని విధాల అనుకూలమని గతంలో పలు మీడియా సంస్థలతో ఇచ్చిన ఇంటర్వ్యూలో విష్ణు కుమార్ రాజు మాట్లాడారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు మాట మార్చి ఇంతలా దిగజారి మాట్లాడుతారు అనుకోలేదు. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బతినేట్లు మాట్లాడిన విష్ణు కుమార్ రాజు వెంటనే క్షమాపణ చెప్పాలనీ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కటూమురి సతీష్, ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాస్ రావు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కంపా హునుక్, అల్లు శంకర్ రావు, స్టాండింగ్ కమిటీ మెంబర్ సారిపిల్లి గోవింద్, కార్పొరేటర్లు పద్మారెడ్డి, ఆళ్ళ లీలావతి శ్రీనివాస్, కంటిపాము కామేశ్వరి, రేయ్యి వెంకట్ రమణ, కె. వి. యన్ శశికళ, నీలిరవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed