టీడీపీ, జనసేన మధ్య టఫ్ ఫైట్.. నేటితో తెగిపోనున్న పంచాయితీ

by srinivas |   ( Updated:2024-08-08 02:24:40.0  )
టీడీపీ, జనసేన మధ్య టఫ్ ఫైట్.. నేటితో తెగిపోనున్న పంచాయితీ
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ టీడీపీకి సవాలుగా మారింది. ఎమ్మెల్యే టికెట్ దక్కని ఆశావహులకు తగిన స్థానం కల్పిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎమ్మెల్యే టికెట్ దక్కని వారితో పాటు మంత్రి పదవులు దక్కని కొందరు సీనియర్లు సైతం నామినేటెడ్ పదవుల కోసం పట్టు పడుతున్నట్లు సమాచారం. ఆశావహులు భారీగా ఉండటంతో నామినేటెడ్ పోస్టుల భర్తీ కత్తిమీద సాములా మారింది.

బీసీలకు పెద్దపీట..

ఈ సారి నామినేటెడ్ పదవుల్లో బీసీలకు పెద్ద పీట వేయాలని టీడీపీ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. సామాజిక సమీకరణాలతో పాటు సీనియారిటీ, పార్టీకి విధేయత, యువతకు పెద్దపీట వేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. కేబినెట్ హోదా ఉన్న పదవుల కోసం నాయకుల చుట్టూ ఆశావహులు ప్రదక్షిణలు చేస్తున్నారు.

నేడు తుది నిర్ణయం..

నేడు జరిగే పొలిట్ బ్యూరోలో నామినేటెడ్ పోస్టుల భర్తీపై తుది నిర్ణయం తీసుకుంటారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే కూటమిలో భాగంగా కొన్ని కీలక నామినేటెడ్ పోస్ట్‌లు కావాలని జనసేన డిమాండ్ చేస్తుంది. టీటీడీ, ఏపీఎస్ఆర్టీసి, ఏపిఎండీసీ, ఏపీఐఐసీ, పీసీబీ, ఏపీడిసి, శాప్ ఛైర్మన్ పదవుల కోసం నాయకులు పోటీపడుతున్నారు. దుర్గగుడి ఛైర్మన్, ఆప్కాబ్, మార్క్ ఫెడ్ పదవుల ఆశావహుల జాబితా రోజురోజుకీ పెరుగుతుంది.

ఇదిలా ఉంటే కొందరు సీనియర్ నాయకులు చైర్మన్ పదవి కాకపోయినా టీటీడీ బోర్డు సభ్యుడిగా అయినా అవకాశం కల్పించాలని కోరుతున్నారు. టీటీడీ బోర్డ్ చైర్మన్‌గా టీవీ5 చైర్మన్ బీఆర్ నాయుడు పేరు దాదాపు ఖరారైనట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణ నుంచి ఇద్దరు నాయకులకు టీటీడీ బోర్డు సభ్యులుగా అవకాశం కల్పించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. వీరితో పాటు ఎస్వీబీసీ చైర్మన్‌గా తెలంగాణ నుంచి ఓ అధికార ప్రతినిధికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed