- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం.. మాజీ సీఎం జగన్ దిగ్భ్రాంతి

దిశ, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లా (Palnadu District)లో ట్రాక్టర్ ప్రమాద (Tractor Accident) ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Former CM YS Jagan Mohan Reddy) స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ప్రమాద బాధితులను ప్రభుత్వం (government) ఆదుకోవాలని కోరారు. పల్నాడు జిల్లా, ముప్పాళ్ల (Muppalla)లో జరిగిన ట్రాక్టర్ ప్రమాదంపై మాజీ సీఎం జగన్ దిగ్భ్రాంతి (Shock) వ్యక్తం చేశారు. బొల్లవరం (Bollavaram) నుంచి కూలీలతో చాగంటివారిపాలెం (Chagantipalem) వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడి నలుగురు మహిళలు (Four Women) మృత్యువాత (Died) పడటంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
అలాగే పొలం పనులు ముగించుకుని ఇంటికి చేరుకునే సమయంలో ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం (Better Treatment) అందించాలని, మృతుల కుటుంబాలను (Died Families) ఆదుకోవాలని వైసీపీ నేత (TCP Leader) ప్రభుత్వాన్ని కోరారు. కాగా ఏపీ (AP)లోని పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం (Fatal Accident) జరిగింది. పొలం పనులు ముగించుకొని ఇంటికి వెళుతున్న సమయంలో కూలీలతో ఉన్న ట్రాక్టర్ బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో నలుగురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా.. మరి కొందరికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారిలో గంగమ్మ (Gangamma), సామ్రాజ్యం (Samrajyam), పద్మ (Padma), మాదవి (Madhavi) అనే మహిళలు (Womwn)ఉన్నారని పోలీసులు (Polie) గుర్తించారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు (CM Chandrababu) స్పందిస్తూ.. విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అంతేగాక మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.