ఏపీలో ఎన్నికలు ఈసారి అంత ఈజీకాదు: వైసీపీ ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు

by Seetharam |   ( Updated:2023-10-16 06:32:05.0  )
ఏపీలో ఎన్నికలు ఈసారి అంత ఈజీకాదు: వైసీపీ ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఎన్నికలపై మాజీమంత్రి, వైసీపీ సీనియర్ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికలు అంత ఈజీగా ఉండవన్నారు. అయినప్పటికీ తాము గట్టిగా పోరాటం చేస్తామని బాలినేని స్పష్టం చేశారు. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. వైసీపీ గెలుపుకోసం ప్రతీ ఒక్కరూ మరింత కష్టపడాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. రాజకీయాల కోసమే కాదు ప్రజల కోసం కూడా మాగుంట కుటుంబం వారి సొంత డబ్బును ఖర్చు చేస్తోందని చెప్పుకొచ్చారు. ఇటీవల కాలంలో మాగుంట కుటుంబం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుందని అయినప్పటికీ మౌనంగా ఉంటూ ముందుకు సాగుతున్నారని మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసుల రెడ్డి పోటీ చేస్తారో.. ఆయన తనయుడు పోటీ చేస్తారో అనేది తెలియాల్సి ఉందన్నారు. తండ్రి శ్రీనివాసులరెడ్డి పోటీ చేసినా తనయుడు పోటీ చేసినా గెలుపొందడం ఖాయమని మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Next Story