సీఎం జగన్ చేతిలో రూ. 7 వేలు మాత్రమే.. అఫిడవిట్‌లో మైండ్ బ్లోయింగ్ అంశాలు

by srinivas |   ( Updated:2024-04-22 11:21:26.0  )
సీఎం జగన్ చేతిలో  రూ. 7 వేలు మాత్రమే.. అఫిడవిట్‌లో మైండ్ బ్లోయింగ్ అంశాలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కడప జిల్లా పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయన ఈ నెల 25న నామినేషన్ దాఖలు చేయనున్నారు. దీంతో ఎన్నికల అఫిడవిట్‌లో జగన్ ఆస్తుల వివరాలను పొందుపర్చినట్లు తెలుస్తోంది. ఈ అఫిడవిట్‌లో నామినేషన్ల సందర్భంగా ఆర్వోకు సమర్పించారు. ప్రస్తుతం సీఎం జగన్ చేతిలో ప్రస్తుతం రూ. 7 వేలు ఉన్నాయని, ఆయన సతీమణి భారతి దగ్గర రూ. 10 వేలు క్యాష్ ఉన్నాయని ఆఫిడవిట్‌లో దాఖలు చేసినట్లు తెలుస్తోంది. సీఎ జగన్ వద్ద మూవబుల్ అసెట్స్ రూ. 450 కోట్లకు పైగా ఉన్నట్లు పేర్కొన్నారు. వైఎస్ భారతి వద్ద మూవబుల్ అసెట్స్ రూ. 119.38 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. సీఎం జగన్ స్థిరాస్తులు రూ. 35.90 కోట్లు కాగా, భారతి స్థిరాస్తులు రూ. 31.11 కోట్లు ఉన్నట్లు ఆఫిడవిట్‌లో పొందుపర్చినట్లు తెలుస్తోంది. అయితే దేశంలో అత్యంత రిచ్ సీఎం.. జగన్ అని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. కానీ చాలా మంది తెలుగు అభ్యర్థులకు సీఎం జగన్ కంటే ఎక్కువ ఆస్తులున్నాయి. ఈ విషయం చాలా చోట్ల నామినేషన్ల వేళ బయటపడింది. దీన్ని బట్టి సీఎం జగన్‌పై ప్రతిపక్ష నేతలు చేస్తున్నవి ఆరోపణలు మాత్రమేనని తెలుస్తోంది.

Advertisement

Next Story