- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వంద జన్మలెత్తినా ఆ పని చేయలేరు.. Cm Jaganపై Chandrababu విమర్శలు
దిశ, వెబ్ డెస్క్: మహాసేన రాజేశ్‌ని తెలుగుదేశం పార్టీలోకి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సాదరంగా ఆహ్వానించారు. మహాసేన రాజేశ్ దళితులు, బడుగులు బలహీన వర్గాల కోసం ఎంతో పోరాటం చేశారని అందుకే ఆయన తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఆదరణ ఉందని కొనియాడారు. దళితుల అభివృద్ధికి టీడీపీ కట్టుబడి ఉందని చెప్పారు. గతంలో రెండుగ్లాసులు విధానాన్ని టీడీపీ రూపుమాపిందని గుర్తు చేశారు. పెత్తనదారీ వ్యవస్థ, దేవాలయంలోకి దళితుల ప్రవేశాలు నిరాకరణ వంటి అంశాలను పరిశీలించి జస్టిస్ పున్నయ్య ఆధ్వర్యంలో కమిషన్ వేసినట్లు గుర్తు చేశారు. ఎస్సీఎస్టీలను ఎవరైనా హింసిస్తే ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి బొక్కలో వేస్తామని తమ ప్రభుత్వం హెచ్చరించిందని తెలిపారు.
అలాగే దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడేలా టీడీపీ కృషి చేసిందన్నారు. వైసీపీ నాయకులు విచిత్రమైన జంతువులు అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు. వ్యవసాయం దండగా అన్నానని తప్పుడు ప్రచారం చేశారని..చెప్పుతో కొడతానంటే నోరుమూసుకున్నారని ఎద్దేవా చేశారు.. అలాగే ఇటీవల కాలంలో దళితులలో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్నానని దుష్ప్రచారం చేశారని చెప్పుకొచ్చారు. ప్రతిభాభారతిని శాసన సభా స్పీకర్.. లోక్‌సభ స్పీకర్‌గా జీఎంసీ బాలయోగిని చేసినట్లు గుర్తు చేశారు. కాకి మాధవరావు అనే దళిత వ్యక్తిని సీఎస్‌గా చేసిన విషయాన్ని గుర్తు చేశారు. సీఎం జగన్ వంద జన్మలెత్తినా ఈ పనులు చేయలేరని చంద్రబాబు చెప్పారు.