- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Chandrababuకు షాక్... డీఎస్పీ ఫిర్యాదుతో కేసు నమోదు
దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు షాక్ తగిలింది. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. చంద్రబాబుతో పాటు 8 మంది టీడీపీ నేతలు, వెయ్యి మంది కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. డీఎస్పీ భక్తవత్సలం ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సాయంత్రం చంద్రబాబు నాయుడు భారీ కాన్వాయ్‌తో బలభద్రపురం నుంచి అనపర్తి బయలుదేరారు. అయితే బలభద్రపురం సాయిబాబా ఆలయం దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదని నిరాకరించారు. ఏకంగా పోలీసులే రోడ్డుపై బైఠాయించారు. బారికేడ్లను ఏర్పాటు చేశారు. వాటిని టీడీపీ కార్యకర్తలు తోసేశారు. ఈ పరిణామాలతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అయితే చంద్రబాబు, టీడీపీ నాయకులపై నిబంధనల ఉల్లంఘన, పోలీసులపై దురుసుగా మాట్లాడి, దూషించారని డీఎస్పీ భక్తవత్సలం ఫిర్యాదు చేశారు. దీంతో చంద్రబాబుతోపాటు టీడీపీ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.