Pawan Kalyan:డిప్యూటీ సీఎం పవన్‌తో డీజీపీ భేటీ.. కారణం ఇదే!

by Jakkula Mamatha |
Pawan Kalyan:డిప్యూటీ సీఎం పవన్‌తో డీజీపీ భేటీ.. కారణం ఇదే!
X

దిశ,వెబ్‌డెస్క్: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌(Deputy CM Pawan Kalyan)తో డీజీపీ ద్వారకా తిరుమలరావు(DGP Dwaraka Tirumala Rao) భేటీ అయ్యారు. నేడు(శనివారం) గుంటూరు జిల్లా(Guntur District) మంగళగిరి లోని క్యాంపు కార్యాలయంలో వీరిద్దరూ పలు విషయాలపై చర్చించుకున్నారు. ఇటీవల రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడి(sexual assault) ఘటనలు అలాగే సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులపై కూటమి ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న నేరాలు, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు, అరెస్టులపై డిప్యూటీ సీఎం పవన్‌తో చర్చించినట్లు సమాచారం. గతంలో సామాజిక మాధ్యమాల్లో వైఎస్సార్సీపీ నేతల పోస్టులపై చర్యలు తీసుకోవడంలో పోలీసుల తీరుని పవన్‌ కల్యాణ్‌ తప్పుబట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్‌ కల్యాణ్‌తో డీజీపీ ద్వారకా తిరుమలరావు సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement

Next Story