ఏపీ అసెంబ్లీ న్యూ స్పీకర్ అయ్యన్న పై ప్రశంసల వర్షం కురిపించిన డిప్యూటీ సీఎం పవన్

by Mahesh |   ( Updated:2024-06-22 07:00:25.0  )
ఏపీ అసెంబ్లీ న్యూ స్పీకర్ అయ్యన్న పై ప్రశంసల వర్షం కురిపించిన డిప్యూటీ సీఎం పవన్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా సీనియర్ నాయకుడైన అయ్యన్నపాత్రుడిని కూటమి ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఈ క్రమంలో టీడీపీ నుంచి సీఎం చంద్రబాబు, జనసేన తరుఫున పవన్ కల్యాణ్, బీజేపీ తరఫున సత్య కుమార్ ముగ్గురు కలిసి అయ్యన్నపాత్రుడిని స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టారు. అనంతరం ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కవితను చెప్పారు. అలాగే దశాబ్దాలుగా ప్రజలు ఎపీ అసెంబ్లీలో అయ్యన్న వాడివేడిగా చూశారని.. ఇక నుంచి ప్రత్యర్థులను తిట్టే అవకాశం ఆయనకు లేదని.. సభలో ఎవరైన తిట్టుకుంటే ఆయనే కంట్రోల్ చేయాలని.. ఏపీ ప్రజలు ఇక నుంచి అయ్యన్న హుందాతనాన్ని చూస్తారని పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. అలాగే ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సభాపతి గా ఎన్నికైన అయ్యన్నపాత్రుడుకి జనసేన తరపున శుభాకాంక్షలు తెలుపుతున్నానన్నారు.

Advertisement

Next Story