- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం జగన్‌పై దాడి కేసు.. నిందితుడికి 14 రోజుల రిమాండ్
దిశ, వెబ్ డెస్క్: సీఎం జగన్‌పై రాయితో దాడి కేసులో నిందితుడు సతీశ్‌కు కోర్టు 14 రోజలు పాటు రిమాండ్ విధించింది. విజయవాడ సింగ్ నగర్‌లో బస్సు యాత్ర నిర్వహిస్తున్న సమయంలో సీఎం జగన్‌పై రాయితో దాడి జరిగింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు విచారణ జరిపి నిందితుడు సతీశ్‌ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశ పెట్టారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు నిందితుడు సతీశ్‌కు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
అయితే నిందితుడు సతీశ్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు పలు కీలక విషయాలు వెల్లడించారు. సీఎం జగన్ పై నిందితుడు రెండు సార్లు రాయి విసిరినట్లు తెలిపారు. ఒక సారి మిస్ కావడంతో మరోసారి తగిలినట్లు పేర్కొన్నారు. సీఎం జగన్‌పై దాడి చేయమని నిందితుడు సతీశ్‌కు దుర్గారావు అనే వ్యక్తి చెప్పినట్లు చెప్పారు. దాడి తర్వాత దుర్గారావుకు నిందితుడు సతీశ్ ఫోన్ చేశారని, మరోసారి చేస్తే స్విచ్చాఫ్ వచ్చిందని రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపారు.
Read More..